Saturday, September 10, 2011

యువ కిరణాలు కార్యక్రమానికి మన్మోహన్‌సింగ్‌

రాజీవ్ యువ కిరణాలు కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీఎం కిరణ్ ఆహ్వానించారు. డిసెంబర్ నెలాఖరుకు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ఒకేరోజు లక్ష మందికీ నియామక ఉత్తర్వులు ఇస్తామని.. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరానని ఆయన చెప్పారు.

యువ కిరణాల కార్యక్రమానికి ముసలివాణ్ణి నేనెందుకులే కిరణ్ ! 45ఏళ్ళ యువకిరణం రాహుల్ గాంధీ ఉన్నాడు చూడు ఆయన్ను ఆహ్వానించు.ఎలాగూ నేను డమ్మీ క్యాండిడేటునేకదా!

Sunday, August 21, 2011

మేధావులు, తటస్థులూ పార్టీలోకి రండి--పీసీసీ చీఫ్ సత్తిబాబు ఆహ్వానం

మేధావులు, తటస్థులూ పార్టీలోకి రండి--పీసీసీ చీఫ్ సత్తిబాబు ఆహ్వానం

వచ్చాడుగా చిరంజీవి,అంటే ఆయన మేధావికాదు బకరా అనా మీ ఉద్దేశ్యం.

Saturday, August 20, 2011

బ్రదర్ అనిల్ కుమారూ ! వర్షాన్ని ఆపగలిగే శక్తి ఉన్న నీవు జగన్ పైనా నీ పైనా జరిగే సిబిఐ దాడులను ఆపలేవా ?



బ్రదర్ అనిల్ కుమారూ ! వర్షాన్ని ఆపగలిగే శక్తి ఉన్న నీవు జగన్ పైనా నీ పైనా జరిగే సిబిఐ దాడులను ఆపలేవా ?
అలాగే ఏసుప్రభువు నీ కిచ్చిన authority తో వరదలొచ్చి మా పంటలను నాశనం చేస్తున్నప్పుడు ఆ వర్షాన్ని ఆపి పుణ్యం కట్టుకో బాబూ ! మా రైతులమంతా మీకు ఋ పడి ఉంటాం .

Sunday, April 10, 2011

ఖనిజమంతా గాలికి కొట్టుకొని పోయిన తర్వాత ఖనిజం లీజులిక ఖఠినమట

ఖనిజం లీజులిక ఠినం
ప్రైవేటు సంస్థల ఇష్టా రాజ్యానికి చెల్లు
మార్కెట్టును బట్టి ధరల పెంపు -- ఈనాడు

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel4.htm

ఖనిజమంతా గాలికి కొట్టుకొని పోయిన తర్వాత ఖనిజం లీజులిక ఠినమట

Saturday, April 9, 2011

అన్నా హజారేను ప్రభావితం చేసిన వివేకానందుని రచన

అన్నా హజారే "తన జీవితానికి సార్ధకతను కలిగించే లక్ష్యాలను " నిర్దేశించుకున్నాడు.న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో ఒక పుస్తకం కొన్నాడు అతను. వివేకానందుని రచన "జాతి నిర్మాణ గమ్య సాధనకై యువతకు పిలుపు" అనే ఆ పుస్తకం అతనిని చాలా ప్రభావితం చేసినది. రాజస్థాన్ లోని రాలె గావ్ అతడి స్వంత ఊరు. స్వగ్రామమైన రాలె గావ్ ను అభివృద్ధి పరచుటతో సామాజిక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.ఒకప్పుడు కరువు కాటకాలతో విల విలలాడిన రాలేగావ్ , సుక్షేత్రంగా మారింది.

మరి విద్యార్థుల పాఠ్యాంశంగా వివేకానందుని రచనలు చేర్చాలని ఆలోచిస్తుంటే మన మేతావులు కొంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

Tuesday, March 29, 2011

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel3.htm

మా ఇంటికి రండి!
పాక్‌ అభిమానులకు పంజాబీల స్వాగతం
మొహాలీ, చండీగఢ్‌లలో స్వచ్ఛందంగా వసతి
క్రికెట్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ పుణ్యమా అని భారత్‌-పాకిస్థాన్‌ మధ్య పునఃప్రారంభమైన దౌత్యం ఎంతమేర ముందుకెళ్తుందో తెలియదుగానీ.. మొహాలీ, చండీగఢ్‌ వాసులు మాత్రం శాంతిబాటలో ముందడుగు వేశారు. ఇరు దేశాల ప్రభుత్వాలకు మార్గదర్శనం చేస్తున్నారు! బుధవారం మొహాలీలో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే చరిత్రాత్మక మ్యాచ్‌ చూసేందుకు సరిహద్దు దాటి వస్తున్న పాక్‌ అభిమానులకు చండీగఢ్‌, పంచకుల, మొహాలీ నగరాల ప్రజలు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 'మా ఇంటికి రండి..' అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. భారత్‌-పాక్‌ సెమీఫైనల్‌పై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో, చండీగఢ్‌తోపాటు చుట్టుపక్కల దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో హోటళ్లన్నీ నిండిపోయాయి. మామూలుగా రోజుకు వెయ్యి రూపాయలు ఉండే హోటళ్ల అద్దెలు ఐదు వేల రూపాయల దాకా పలుకుతున్నాయ్‌! ఇప్పుడవి కూడా దొరకని పరిస్థితి! మరోవైపు పాక్‌ నుంచి వస్తున్న అభిమానులందరికీ వీసాల జారీ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. సుమారు వెయ్యి నుంచి ఐదు వేల దాకా వీసాలిస్తారని సమాచారం. చివరి నిమిషంలో వారంతా ఇక్కడికి చేరుకుంటుండటంతో వసతి దొరకడం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ప్రజలే తమ ఇళ్లలో వారికి ఆతిథ్యమివ్వటానికి సిద్ధపడ్డారు. మొదట పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇళ్లలో ఒక్కొక్కరికి వసతి కల్పిస్తామని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మిగతా ప్రజలూ ఇందుకు ఆసక్తి చూపడంతో పంజాబ్‌ ప్రభుత్వం మొహాలీ పోలీసు డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆతిథ్యమివ్వదలచుకున్న వారు తమ ఇంటి చిరునామాను ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు.

మీరు వారికి పోటీబడి ఆతిథ్య మివ్వడం బాగుందిగానీ వచ్చేవారు తిన్న ఇంటి వాసాల్లెక్కపెట్టేవాళ్ళు జర బద్రం .

వింటున్నారా మనమోహనసింగు గారూ !

Saturday, March 12, 2011

అసెంబ్లీ మరణించింది ,17న మాసికం పెడతాం -కోదండరాం

అసెంబ్లీ మరణించింది ,17న మాసికం పెడతాం -కోదండరాం

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/mar/13/main/13main12&more=2011/mar/13/main/main&date=3/13/౨౦౧౧


ముందు నీకూ, కెసియార్ కు పెడితే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుంది

Sunday, February 27, 2011



గ్రామాల్లో ఆదాయాలు పెరుగుతుండడంవల్లే ధరలు ఎగబాకుతున్నాయి-రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సుబ్బారావు వెల్లడి
http://eenadu.net/story.asp?qry1=14&reccount=26http://www.blogger.com/img/blank.gif
గ్రామాల్లో ఆదాయాలు పెరుగుతుండడంతో ప్రజలు ఇంతకు ముందుకన్నా మెరుగైన ఆహారం తీసుకుంటున్నారు.తృణధాన్యాలు తీసుకునేవారు మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారం వైపు మరలుతున్నారు.ఇది ఆహార కొరతకు దారి తీస్తోంది.

ప్రియమైన నా దేశ గ్రామ ప్రజలారా! ధరలు తగ్గాలంటే మీరు ఇంతకు ముందు మాదిరే రాగి సంగటి,జొన్నముద్ద,కొర్రన్నము ఊరిమిండితో(పచ్చడి)గానీ కారంపొడితో గానీ తినండి నాయన్లారా!మాంసకృత్తులుండే భోజనం చేయద్దండి.మీ ఆరోగ్యానికి మంచిది,దాంతో పాటు ధరలు కూడా తగ్గుతాయి.మాంసకృత్తులుండే ఆహారం పట్టణ,నగర పెజలకే పరిమితం నాయనా!